పాలిటిక్స్ లోకి వరలక్ష్మి

0‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ల తర్వాత విజయ్‌, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మూడో చిత్రం తెరకెక్కతుంది. ఇటివలే ఈ సినిమా పూజ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. వ్యవసాయం, రాజకీయం కలబోసిన కథతో ఈ చిత్రం తయారవుతోంది. ఇందులో పలువురు నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రాధారవి, పళ.కరుప్పయ్య రాజకీయ నేతలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఓ ప్రధాన పాత్రలో హీరోయిన్ వరలక్ష్మి నటిస్తున్నారు. అయితే ఆమె పాత్ర ఏమిటనే విషయం ఇప్పటివరకు రాలేదు. ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా కనిపిస్తారని టాక్. ‘కొడి’ చిత్రంలో త్రిష రాజకీయవాదిగా నెగటివ్‌ ఛాయలు ఉండే పాత్రలో నటించినట్లే ఈ చిత్రంలో వరలక్ష్మి పాత్ర ఉంటోందని సమాచారం. ‘తుపాకి’, ‘కత్తి’ చిత్రాల మాదిరిగా ఈ సినిమా కూడా దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.