అజ్ఞాతవాసి టీజర్ ఫై వర్మ కామెంట్లు

0పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభించింది. సినీ ప్రముఖులు, అభిమానులు టీజర్‌ ఆకట్టుకుందని ట్వీట్లు చేశారు. ఈ టీజర్‌ను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, హీరో రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించారు. పవన్‌ తన స్టైల్‌లో అదరగొట్టారనే అర్థంతో పోస్ట్‌లు చేశారు.

* రామ్‌గోపాల్‌ వర్మ: ‘‘అజ్ఞాతవాసి’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది.. పీకే (పవన్‌కల్యాణ్‌) అత్యుత్తమంగా కనిపించారు’.

* రామ్‌చరణ్‌: ‘బాబాయ్‌ ఎట్‌ హిజ్‌ బెస్ట్‌. టీజర్‌లో ఆయన ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ చాలా నచ్చింది. సంక్రాంతి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’.

శనివారం సాయంత్రం విడుదలైన ఈ ప్రచార చిత్రాన్ని యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 78.86 లక్షల మంది వీక్షించారు. 4,49,001 మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఒకటో స్థానంలో ఉంది.

కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ ‘అజ్ఞాతవాసి’లో కథానాయికలుగా నటిస్తున్నారు. ఖుష్బూ, బొమాన్‌ ఇరానీ, రావు రమేశ్‌, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జనవరి 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.