మహిళా దినోత్సవం రోజును కూడా వర్మ వదిలిపెట్టలేదు..

0మహిళలంతా ఈరోజు (మార్చి 8 న ) మహిళా దినోత్సవం సంబరాల్లో ఉంటే..సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనదయిన స్టయిల్ లో ట్వీట్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఒకరోజు మాత్రమే మహిళలకు ఇచ్చేయడమంటే.. మిగిలిన రోజులన్నీ పురుషులకు ఇచ్చినట్టుగా అనిపిస్తోందంటూ మహిళలను కించపరిచే విధంగా ట్వీట్ చేసి వారికీ ఆగ్రహం తెప్పించాడు.

‘‘సంవత్సరంలో ఒకరోజు మహిళల కోసం కేటాయించడమంటే మహిళలను ఒక రకంగా కించపరచడమేనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మిగిలిన 364 డేస్ మెన్స్ డేస్‌గా అనిపిస్తున్నాయి. నేను ప్రతిరోజూ ఉమెన్స్ డే అనే నమ్ముతాను ఎందుకంటే ఏ ఒక్క రోజుకు కూడా పురుషుడు అర్హుడు కాడు. అందుకేనేమో పురుష డే అనేదే లేదు’’ అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం వర్మ నాగార్జున తో ఆఫీసర్ అనే సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.