హీరోని వేధిస్తున్న యువతి.. ఆత్మహత్య చేసుకుంటాని బెదిరింపులు..

0Varun-Dhawan-Harassed-By-Stబాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ని ఓ యువతి కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తోందట. దాంతో వరుణ్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ముంబయికి చెందిన ఓ యువతి వరుణ్‌ ఫోన్‌ నంబరు కనుక్కునిరోజూ మెసేజ్‌లు పంపుతోంది.

ఇలా మెసేజ్‌లు చేయద్దు అంటూ పలుమార్లు ఆమెకు వరుణ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. దాంతో వరుణ్‌ ఆమె నంబర్‌నుబ్లాక్‌ చేయించాడు. ఆ తర్వాత ఓ రోజు మరో నంబర్‌ నుంచి వేరే వ్యక్తి వరుణ్‌కి ఫోన్‌ చేశాడు. ఆ అమ్మాయి పంపే మెసేజ్‌లకు సమాధానం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది అని బెదిరించాడు. దాంతో వరుణ్‌ ముంబయిలోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న రెండు ఫోన్‌ నంబర్లు పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశాడు. త్వరలో వారి వివరాలు తెలుసుకుంటామని పోలీసులు మీడియాకు వెల్లడించారు.

వరుణ్‌ నటించిన ‘జుడ్వా2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకొంది. ప్రస్తుతం వరుణ్‌ ‘అక్టోబర్‌’, ‘సూయి ధాగా’ చిత్రాల్లో నటిస్తున్నాడు.