షూటింగ్ లో గాయపడ్డ వరుణ్..

0బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది. సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్‌ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్, సోనాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్రలలో తెర‌కెక్కుతున్న చిత్రం క‌ళంక్‌.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలోని స్డూడియాలో వేసిన భారీ సెట్‌లో వ‌రుణ్ ధావన్ పై సాంగ్ చిత్రీకరిస్తున్నారు . సాంగ్ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో వ‌రుణ్ త‌న కోస్టార్‌పై డోర్ విసిరారు. అది అనుకోకుండా హీరో మోచేతికి త‌గిలింది. దీంతో వరుణ్ కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కొద్దీ సేపటి వరకు వరుణ్ షూటింగ్‌లో పాల్గొనలేదట. ఆ తర్వాత ప్ర‌ధ‌మ చికిత్స చేసుకొని మ‌ళ్ళీ షూటింగ్‌లో పాల్గొన్నాడని తెలుస్తుంది.