హలో బ్రదర్ సీక్వెల్ వచ్చేస్తోంది..

0Varun-Dhawan-Judwaa-2-Movieఅక్కినేని నాగార్జున కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గగ సినిమాల్లో ‘హలో బ్రదర్’ ఒకటి. తెలుగు సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ ఎంటర్టైనర్లలో ఒకటిగా కూడా ‘హలో బ్రదర్’ను చెప్పవచ్చు. తిరుగులేని మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు గొప్ప వినోదాన్ని పంచింది. అద్భుత విజయాన్ని సాధించింది. ఈ చిత్రం హిందీలో ‘జుడ్వా’ పేరుతో రీమేక్ అయి అక్కడా సూపర్ హిట్టవడం విశేషం. అందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. డేవిడ్ ధావన్ దర్శకుడు.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు హిందీలో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని కూడా డేవిడ్ ధావనే రూపొందిస్తున్నాడు. ఐతే సీక్వెల్లో సల్మాన్ హీరోగా నటించట్లేదు. డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడిందులో. అతడి సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాప్సి కథానాయికలుగా నిటించాడు. దసరా కానుకగా సెప్టెంబరు 29న ‘జుడ్వా-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘జుడ్వా-2’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. హిందీలో ఈ చిత్రం బాగా ఆడితే.. తెలుగులోనూ ‘హలో బ్రదర్-2’ వస్తే ఆశ్చర్యం లేదేమో. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా ‘హలో బ్రదర్’ రీమేక్ చేస్తారని.. లేదా సీక్వెల్ తీస్తారని రకరకాల ప్రచారాలు నడిచాయి. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. మరి ‘జుడ్వా-2’ బాగా ఆడితే దాన్ని తెలుగులో చైతూ లేదా అఖిల్ హీరోగా రీమేక్ చేస్తారేమో చూడాలి.