ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న మెగా హీరో..

0గత ఏడాది ఫిదా తో సందడి చేసిన మెగా హీరో వరుణ్ తేజ్..ఏడాది మొదట్లోనే తొలిప్రేమ తో మరో మెగా హిట్ ను అభిమానులను అందించి ఆకట్టుకున్నాడు. ఈ రెండు చిత్రాలు సక్సెస్ జోరు తో నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఇంకాస్త ఇంట్రస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఘాజి సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో సినిమా చెయ్యబోతున్నాడు. ఏప్రిల్ చివరి వారం లో వీరి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.

జ్ఞాన శేఖర్ సినిమాతోగ్రఫి అందిస్తోన్న ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. ఈ సినిమా అంతరిక్షం లో జరిగే కథగా రుపొందనుందని సమాచారం. లవ్ స్టొరీగా తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబదించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.