వరుణ్ తేజ్ తో లారెన్స్ ఢీ?

0అనుకుంటాం కానీ ఎంత ప్లాన్డ్ గా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకోసారి క్రేజీ సినిమాల క్లాష్ జరుగుతూనే ఉంటుంది. సినిమాల నిర్మాణం అనేది కత్తి మీద సాములా మారిన పరిస్థితుల్లో ఒక తేదీకి కట్టుబడి ఉండటం ఎవరి వల్లా కావడం లేదు. సైరా సాహో లాంటి భారీ ప్రాజెక్ట్స్ మొదలుకుని బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోల సినిమాల దాకా అందరిది ఇదే పరిస్థితి. అందుకే పోటీ తప్పని పరిస్థితుల్లో ఓపెనింగ్స్ కోసం ఎవరికి చేతనైంత వాళ్ళు కంటెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యారా లాంగ్ రన్ కు లోటు ఉండదు. డిసెంబర్ లో అలాంటి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఘాజీతో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న అంతరిక్షంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠితో పాటు అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిసెంబర్ విడుదలకు ఫిక్స్ అయ్యారు కానీ మూడో వారానికా లేదా ఆఖరి వారానికా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

అంతరిక్షంతో పాటుగా రాఘవేంద్ర లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచన 3 కూడా ఆ టైంనే టార్గెట్ చేసుకుంది. హారర్ జానర్ కు కామెడీని మిక్స్ చేసి మునితో కొత్త ట్రెండ్ సెట్ చేసిన లారెన్స్ ఇప్పటి దాకా ఈ సిరీస్ లో పరాజయం అందుకోలేదు. గత చిత్రం గంగ తెలుగులో సైతం మంచి హిట్ గా నిలిచింది. కాంచన 3లో హీరోయిన్లుగా ఓవియాతో పాటు పాటు వేదిక కూడా నటిస్తోంది. మరోకీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కనిపిస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మాణం కావడం వల్ల బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారు. మొదటి సినిమాలకు దీనికి సంబంధం లేకుండా లారెన్స్ దీన్ని తీస్తున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సో అంతరిక్షంతో కాంచన 3 కనక క్లాష్ అయితే పోటీ టఫ్ గానే ఉంటుంది. రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేని జానర్లే అయినప్పటికీ క్రేజ్ పరంగా సమానంగా నిలిచేలా ఉన్నాయి. అంతరిక్షం ఇప్పటి దాకా ఎవరు టచ్ చేయని అంశం. అది ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఇవి కాకుండా రేస్ లో ఇంకేమేం వస్తాయో వేచి చూడాలి.