శ్రీ రెడ్డి నీచమైంది – వరుణ్ తేజ్

0పవన్ కళ్యాణ్ ఫై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అందరూ స్పందిస్తున్నారు..సోషల్ మీడియా లో అయితే ఈ వ్యవహారమే ట్రేడింగ్ గా నడుస్తుంది. అభిమానుల ఆగ్రహాన్ని మొత్తం కామెంట్స్ రూపం లో చూపిస్తున్నారు. మరోపక్క సినిమా ఇండస్ట్రీ నుండి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే నితిన్ శ్రీ రెడ్డి కి స్వీటీ వార్నింగ్ ఇవ్వగా , తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ సైతం శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించాడు.

‘‘నీ గురించి విమర్శంచి.. నిన్ను తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించే నీచ మనస్కుల గురించి పట్టించుకోనవసరం లేదు. అటువంటి వాళ్లు వాళ్ల బలహీనతలను తెలుసుకోలేరు. వాళ్ల తప్పుల్ని వాళ్లు తెలుసుకోవడం కన్నా ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చూపించడంలోనే ఎక్కువ ఉత్సుకత ప్రదర్శిస్తారు’’ అని వరుణ్ ట్వీట్‌లో తెలిపాడు.