రాశీఖన్నాతో వరుణ్ తేజ్ లండన్ ట్రిప్

0Varun-Tej-London-Trip-Raashఫిదా సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు వరుణ్ తేజ్ లండన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. అయితే పనిలో పనిగా ఈ హాలీడే ట్రిప్ నే ప్రొఫిషనల్ టూర్ గా మార్చేశాడు. వరుణ్ తాజాగా తన అప్ కమింగ్ మూవీని భోగవల్లి ప్రసాద్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం టీమ్ మొత్తం లండన్ వెళ్లబోతుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమాలో వరణ్ తేజ్ సరసన ఢిల్లీబ్యూటీ రాశీఖన్నా నటించనుంది. బెంగాల్ టైగర్ తరువాత ఓ సరైన అవకాశం ఎదురుచూస్తున్న రాశీఖన్నాకు వరుణ్ తేజ్ సరసన ఛాన్స్ రావడం ఆమె కెరీర్ ప్లస్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ – రాశీ జోడీ ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక వరుణ్ కెరీర్ లో చాలా రోజులు తరువాత ఫిదాతో తొలిరోజు మార్నింగ్ షోకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ క్రెడిట్ మొత్తం హీరోయిన్ ఖాతాలో వేసేస్తున్నారు సినీజనాలు. అయితే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉండటంతో వరుణ్ కి సైతం ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి ఫిదా సక్సెస్ ని రాశీఖన్నాతో లండన్ లో చేసుకోబోతున్నారు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. మరి ఈ కొత్త సినిమాలో వరుణ్ ఏ తీరున అభిమానుల్ని అలరించబోతున్నాడో చూడాలి.