సభ్య సమాజానికి వరుణ్ తేజ్ మెసేజా?

0


Varun-Tej-Speech-at-Fidaa-A”మామూలుగా నా సినిమా అంటే డాడీయో.. బాబాయో.. బన్నీ అన్నో.. చరణ్ అన్నో వస్తారు. కాని ఈసారి ఎవ్వరూ రాకుండా కేవలం మా క్రూ అంతా స్టేజ్ మీద ఉండాలని అనుకున్నాం. కాని వారెవ్వరూ రాకపోయినా కూడా మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్” అంటూ అభిమానులను పొగిడేశాడు వరుణ్ తేజ్. అయితే సడన్ గా మనోడు ఇలా డిఫరెంట్ గా మాట్లాడుతుండటంతో.. ”ఫిదా” ఆడియో ఫంక్షన్ కు వచ్చినోళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అక్కడి ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లకు కాస్త షేకయ్యారు. సడన్ గా వరుణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మనోడు కూడా ఏదన్న ‘చెప్పను బ్రదర్’ తరహాలో పేలుస్తాడా అని ఖంగారుపడ్డారు. కాని అలాగేం జరగలేదులే.

”ఈరోజు మేమందరం ఇక్కడున్నాం అంటే ఖచ్చితంగా అది చిరంజీవి గారి వలనే. కళ్యాణ్ బాబాయ్ సినిమాల్లోకి రాకముందే.. మేము చిరంజీవి గారిని చూసి సినిమాలపట్ల ఆకర్షితులయ్యాం. ముందు చిరంజీవిగారే. తరువాతే కళ్యాణ్ బాబాయ్” అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చిరుకోటి చదివేశాడు. ఆ విధంగా స్టేజ్ క్రిందన అరుస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఏదన్నా మెసేజ్ ఇచ్చాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. ”నేనెప్పుడూ మా పెదనాన్న.. బాబాయ్.. చరణ్ అన్న గురించి మాట్లాడటం.. చాలామందికి నచ్చదేమో.. కాని ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే వారే కారణం కాబట్టి.. ఖచ్చితంగా మాట్లాడుతాను” అన్నాడు వరుణ్ తేజ్. ఆ విధంగా సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనగానే హర్టయ్యాడట. ”సార్.. (శేఖర్ కమ్ముల).. నేను హర్టయ్యాను. ఉంటే నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండాలి.. హీరోయిన్ ఉండటమేంటి? అని అడిగేశాను. కాని పల్లవి రోల్ బాగా చేసింది. బాబాయ్ డైలాగులు కూడా కొన్ని భలే చెప్పింది” అంటున్నాడు వరుణ్ తేజ్. 200% అద్భుతంగా చేశావ్ అంటూ సాయిపల్లవిని పొగిడేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరక్షన్లో చేయడం బ్లెస్సింగ్ అన్నాడు. అలాగే ఎప్పటికప్పుడు తన సందేహాలను తీరుస్తూ ఈ సినిమాను తీసినందుకు దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్పాడు.