`తొలిప్రేమ` ఫిదా అయ్యింది గురూ!

0వరుణ్ తేజ్ నటించిన సినిమాలే `తొలిప్రేమ` – `ఫిదా`. ఈ రెండూ కూడా వెంట వెంటనే వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. వరుణ్ తేజ్ కెరీర్ని మరో స్థాయిలోకి తీసుకెళ్లాయి. మరి `తొలి ప్రేమ` కొత్తగా ఫిదా కావడమేంటి అంటారా?   అసలు విషయమేంటంటే `తొలి ప్రేమ` సినిమా `ఫిదా` పేరుతో రీమేక్ అయ్యింది. ఎక్కడో తెలుసా?  …బెంగాలీలో. వెంకీ అట్లూరి తెలుగులో తెరకెక్కించిన `తొలి ప్రేమ`  ట్రెండీ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం విడుదల కాగానే చాలా భాషల నుంచి రైట్స్ కోసమని నిర్మాతలు క్యూ కట్టారు.

బెంగాలీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత రైట్స్ తీసుకొని అక్కడ రీమేక్ చేశాడు. అయితే ఆ చిత్రానికి అక్కడ ఫిదా అనే పేరును ఖరారు చేయడం విశేషం. ఫిదా కూడా వరుణ్ తేజ్ సినిమానే. అంటే ఒక సినిమాకి మరొక పేరు కుదిరిందన్నమాట. అదీ అసలు సంగతి. వరుణ్ సినిమాల పేర్లు తెలుసుకొనే అలా పెట్టారో లేదంటే – ప్రేమకథ కాబట్టి ఫిదా అని పెట్టారో తెలియదు కానీ… మొత్తంగా భలే గమ్మత్తుగా సెట్టయ్యింది. భవిష్యత్తులో ఫిదా సినిమాని అక్కడ రీమేక్ చేస్తే అప్పుడు ఏం పేరు పెడతారో చూడాలి. అన్నట్టు బెంగాలీలో కూడా తొలి ప్రేమని చాలా రిచ్ గానే తీశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. పైగా అక్కడ హీరోహీరోయిన్లుగా నటించిన జంటలో కూడా కెమిస్ట్రీ బాగానే కనిపించింది. చూస్తుంంటే తొలిప్రేమ అక్కడ కూడా సక్సెస్ కొట్టేలా కనిపిస్తోంది.