అంతరిక్షంలోకి అడుగెట్టిన అదితి

0అవడానికి తెలుగమ్మాయే అయినా ముందు బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని.. తరవాత మణిరత్నం సినిమాలో మెరిసి ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది అందాల భామ అదితిరావ్ హైదరి. కార్తి హీరోగా మణిరత్నం డైరెక్ట్ చేసిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది.

ఇంతలో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్న సమ్మోహనం సినిమాలో అదితిని హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో టాలీవుడ్ దృష్టి అదితిపై పడింది. వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం డైరెక్టర్ సంకల్ఫ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పేస్ కాన్సెప్ట్ మూవీలో ఆమె ఓ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం స్పేస్ సూట్ వేసుకుని సెట్ లోకి అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తో కలిసి ఆస్ట్రోనాట్ గెటప్ లో ఓ సెల్ఫీ తీసుకుని దీనిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ‘‘చందమామను వెంటాడదం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం’’ అంటూ ఫన్నీగా కామెంట్ యాడ్ చేసింది.

ఈ సినిమాలో ఆస్ట్రోనాట్ గా అదితి రావ్ హైదరి లుక్ చాలా బాగుంది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతున్న అదితి మూవీ సమ్మోహనంలో ఆమె సినిమా హీరోయిన్ గానే కనిపించనుంది. సుధీర్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీంతోపాటు మణిరత్నం తరవాత తమిళంలో తీస్తున్న మల్టీస్టారర్ మూవీ చెక్క చివాంత వనంలోనూ (తెలుగులో నవాబ్) అదితి రావ్ హైదరీయే హీరోయిన్ గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్.. కోలీవుడ్ లో అన్నీ క్రేజీ ప్రాజెక్టులే అదితి చేతిలో ఉన్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే ఆమె టాప్ హీరోయిన్ అవడం గ్యారంటీ.