ఆ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ ఫిక్స్

0

నారా రోహిత్.. శ్రీ విష్ణు.. సుధీర్ బాబు.. శ్రియ సరన్.. వీళ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిందీ చిత్రం. దీన్ని ఈ నెల 5నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే ‘నోటా’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలవుతుండటంతో తర్వాత వాయిదా వేసేశారు.

ఇప్పుడీ చిత్రం కొత్త విడుదల తేదీ చూసుకుంది. అక్టోబరు 26న ‘వీర భోగ వసంత రాయలు’ను విడుదల చేయబోతున్నారు. ఈ రోజే రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలారు. దసరా సెలవుల్లో పోటీ తీవ్రంగా ఉంది. ‘అరవింద సమేత’తో పాటు ‘హలో గురూ ప్రేమ కోసమే’.. ‘పందెంకోడి-2’ లాంటి సినిమాలొస్తున్నాయి. దీంతో ఈ సందడి ముగిశాక తర్వాతి వారంలో తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేస్తారట.

‘వీర భోగ వసంత రాయలు’ టీజర్ ఇంతకుముందే విడుదలైంది. అది కొత్తగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కథేంటన్నది చెప్పలేదు కానీ.. సామాజికాంశాలతో ముడిపడ్డ థ్రిల్లర్ ఇదని అర్థమైంది. ఇందులో నారా రోహిత్ ఒక చేయి లేని వాడిగా కనిపంచబోతుండటం విశేషం. అతడితో పాటు మిగతా వాళ్లు కూడా డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తున్నారు. వాళ్ల గెటప్స్ కూడా భిన్నంగా ఉన్నాయి. అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Please Read Disclaimer