బాహుబలి డిసెంబర్ లో రిలీజ్ !

0veerappa-moily-epic-on-bahuఏడాదిన్నర క్రితం బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయితే.. రెండో భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేస్తామని చెప్పారు కదా! ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ నుంచి క్లారిటీ కూడా ఉంది కదా.. మళ్లీ ఇప్పుడు డిసెంబర్ కి వాయిదా పడిందా అనే డౌట్ రావడం సహజమే కానీ.. ఇది రాజమౌళి బాహుబలి గురించిన సంగతి కాదు. ఇది నిజమైన బాహుబలి గురించి రాసిన ఓ బుక్ గురించిన స్టోరీ.

జైన వీరుడు బాహుబలి(గోమఠేశ్వరుడు)పై మాజీ మంత్రి ఎం వీరప్ప మొయిలీ ఓ పుస్తకాన్ని రాసేశారు. ఈ జైన తీర్ధంకరుడిపై పుస్తకాన్ని బాహుబలి అనే పేరుపై ఈ ఏడాది నవంబర్ లో కానీ డిసెంబర్ లో కాని విడుదల చేస్తామని చెప్పారాయన. బాహుబలి ఆయనకు మూడో పుస్తకం. గతంలో రామాయణ మహాన్వేషణంకు సరస్వతి సమ్మాన్ అవార్డ్ అందుకోగా.. శ్రీముది పరిక్రమణం అనే పుస్తకాన్ని కూడా రచించారు వీరప్ప మొయిలీ. ఈ ఏడాది చివరకు బాహుబలి పుస్తకం పాఠకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే పుస్తకం రాయడం పూర్తి చేయగా.. పలువురు రచయితలకు పంపానంటున్నారు మొయిలీ. ప్రపంచ శాంతి గురించి రాసిన ఈ పుస్తకం దాదాపు 1500 పేజీలు ఉంటుందట. ద్రౌపతి ఆటోబయోగ్రఫీగా పుస్తకరూపం సంతరించుకున్న శ్రీముది పరిక్రమణం అనే బుక్ ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.