ఒకేకారులో.. సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో వెంకటేష్

0


Venkatesh-and-Salman-Khan-Girl-Friend-Lulia-Vantur-In-The-Same-Carటాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కు బాలీవుడ్ లో కూడా బోలెడన్ని పరిచయాలు ఉంటాయి. తాను స్టార్ హీరో అయినా.. నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కుటుంబ నేపథ్యం కావడంతో.. అనేక మంది బాలీవుడ్ టాప్ స్టార్స్ తో కూడా రిలేషన్స్ ఉంటాయి. రీసెంట్ గా ముంబై ట్రిప్ వేశాడు టాలీవుడ్ గురు వెంకటేష్.

అక్కడి బాంద్రాలోని ఓ ప్రాంతంలో కనిపించాడీ హీరో. అయితే.. వెంకీ ఒంటరిగా కనిపించి ఉంటే పెద్ద మ్యాటరేమీ ఉండేదు కాదు. కానీ.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు లవర్ అని.. కాబోయే భార్య అని ప్రచారం జరుగుతున్న లూలియా వంతూర్ తో కలిసి కనిపించాడు వెంకటేష్. సల్మాన్ ఖాన్.. వెంకటేష్ గతం నుంచి మంచి మిత్రులే. అయితే.. వారి రిలేషన్ మరీ ఇంత స్ట్రాంగ్ అనే విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. లూలియా వంతూర్ తో కలిసి సౌత్ హీరో వెంకటేష్ కనిపించాడంటూ.. బాలీవుడ్ మీడియా తెగ హంగామా చేసేస్తోంది.

ఇద్దరూ కలిసి ఏదో షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తూ ఇలా మీడియా కంటపడ్డారట. అంతే.. ఇక లూలియా- వెంకీల ఫోటోలను తెగ ప్రచారం చేసేస్తూ.. ఏదో ఈవెంట్ కోసం వీరిద్దరూ ఇలా షాపింగ్ చేస్తున్నారంటూ కథనాలు అల్లేస్తోంది బాలీవుడ్ మీడియా. ఇంతకీ అసలు సల్మాన్ కాబోయే వైఫ్ తో వెంకీ ఎందుకు కలిసి కనిపించాడనే పాయింట్ కు అసలైన ఆన్సర్ దొరకడం కాసింత కష్టమే. వెంకీ-సల్మాన్ కాంబినేషన్లో ఏదన్నా సినిమా స్టార్ట్ అవుతోంది అంటారా? ఆ సినిమాను లూలియా ప్రొడ్యూస్ చేస్తోందా? ఏమో దెల్వద్ మరి!!