F2: ఎర్ర చొక్కా- గళ్ళ లుంగీల్లో తోడల్లుళ్ళ రచ్చ

0

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మల్టిస్టారర్ సినిమాల్లో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘F2’. వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర్కక్కుతున్న ఈ సినిమా టైటిల్ ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుండి నిర్మాతలు దీపావళి సందర్భంగా ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

పోస్టర్లో వెంకీ వరుణ్ లు ఇద్దరూ మాస్ మసాలా పాటకు స్టెప్పులు వేస్తున్నారో ఏమోగానీ ఇద్దరూ ఊర మాస్ గెటప్పులో ఉన్నారు. లోపల తెల్ల టీ-షర్ట్ పైనేమో ఎర్రటి చొక్కాలు వేసుకొని గళ్ళ లుంగీలు కట్టుకున్నారు. కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని మ.. మ.. మామాస్ అన్నట్టుగా హింట్ ఇస్తున్నారు. ఈ సినిమాకు అసలే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయన రెచ్చిపోయి మరీ జోరుగా ఉన్న మాస్ ట్యూన్ ఇచ్చి ఉంటాడు.. వీళ్ళిద్దరూ దేవీ ట్యూన్ ని మ్యాచ్ చేయాలనే పట్టుదలగా డ్యాన్స్ చేస్తున్నట్టుంది.

తమన్నా.. మెహ్రీన్ లు ఈ సినిమాలు హీరోయిన్లు గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సిన్నిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దిల్ రాజుకు అసలేమాత్రం కలిసి రాలేదు. మరి నెక్స్ట్ ఇయర్ వీళ్ళ ఫన్ ఫ్రస్ట్రేషన్ తో హిట్ కొడతాడేమో వేచి చూడాలి.