వెంకీ-వరుణ్ కి భామలు సెట్టయ్యారు..

0వెంకటేష్ – వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ పనులను F2 చిత్ర యూనిట్ చాలా స్పీడ్ గా కొనసాగిస్తోంది. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా అనిల్ F2 చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. గత కొన్ని వారాలుగా కష్టపడి రాసిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ అవ్వడంతో నిర్మాత దిల్ రాజు ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని నటీనటులను ఫైనల్ చేయడంలో బిజీ అయ్యారు.

రీసెంట్ గా ఒకేసారి ఇద్దరు హీరోలకు హీరోయిన్స్ ఫిక్స్ చేసేశారు. ఇంతకుముందు కొన్ని పేర్లు వినిపించినా అందులో ఇది నిజం కాలేదు. ఫైనల్ గా వెంకటేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా ని ఫిక్స్ చేశారు. గత కొంత కాలంగా ఈ బ్యూటీకి సరైన హిట్ లేదు. అదే తరహాలో మరో హిట్స్ లేని హీరోయిన్ ని వరుణ్ కి సెట్ చేశారు. మొదట్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మెహ్రీన్ కౌర్ ఆ తరువాత జవాన్ – కేరాఫ్ సూర్య సినిమాలు చేసి డిజాస్టర్స్ అందుకుంది.

ఇక ఇప్పుడు సక్సెస్ ట్రాక్ లో ఉన్న వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అందులోనూ దర్శకుడు అనిల్ రావిపూడి కావడంతో మళ్లీ రాజా ది గ్రేట్ సినిమా లాంటి హిట్ అందుతుందని అమ్మడు ఆశలు గట్టిగానే పెట్టుకుంది. మొత్తానికి వరుణ్ వెంకీ కి జోడీలు సెట్ అయ్యాయి. ఇక రెండు వారాల్లో సినిమాను స్టార్ట్ చేయాలని దర్శకుడు నిర్మాత స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారు. మరి F2 ప్రాజెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.