అప్పుడు బాక్సింగ్.. ఇప్పుడు హార్స్ రేసింగ్?

0

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మల్టిస్టారర్ ‘ఎఫ్2’ ఘన విజయం సాధించడంతో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టడంలో తన జోరు పెంచారు. ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మరో మల్టి స్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు.

వాటిలో ఒకటి ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసేది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రారంభం అయిందని సమాచారం. దసరా నాటికి ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బైటకు వచ్చింది. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. హార్స్ రేసుల నేపథ్యంలో తరుణ్ భాస్కర్ ఒక విభిన్నమైన కథను రెడీ చేస్తున్నాడట. మరి ఈ సినిమాలో వెంకీ పాత్ర గురించి ఇంకా వివరాలు తెలియదు కానీ రెగ్యులర్ మసాలా సినిమా మాత్రం కాదని అంటున్నారు.

స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల్లో నటించడం వెంకీకి కొత్తేమీ కాదు. ‘ఎఫ్ 2’ కు ముందు వెంకీ నటించిన ‘గురు’ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. మధ్య వయస్కుడైన బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. మరి ఈసారి ఎలాంటి విభిన్నమైన పాత్రతో మనముందుకు వస్తాడో వేచి చూడాలి.
Please Read Disclaimer