ముచ్చటగా మూడోసారి

0venky-nayantaraలక్ష్మీ, తులసి చిత్రాలలో జంటగా నటించి సూపర్ జోడి అనిపించుకున్నారు వెంకటేష్,నయనతార. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తెరపై సందడి చేయనున్నారు. దర్శకుడు మారుతి వెంకటేష్ తో ఓ చిత్రం చేయనున్నారు. ‘రాధ’ టైటిల్. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా నయనతారను ఖరారు చేసినట్లుగా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2014 సంక్రాంతికి ఈ చిత్రం సెట్స్ పై వెళ్లనుంది.