రకుల్ కాదు.. నభా కాదు.. రాశి!

0

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ అనే ఒక మల్టిస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల విషయం ఒక పట్టాన తేలడం లేదు. మొదట అనుకున్న హీరోయిన్ల పేర్లు ఇప్పుడు మారిపోతున్నాయి. వెంకీ సరసన మొదట శ్రియ నటిస్తుందని అన్నారు కానీ ఇప్పుడు ‘RX100’ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు ఆ అవకాశం వచ్చిందని అంటున్నారు.

మామ అలా ఉంటే మేనల్లుడు ఆయనకు మించి ఉంటాడు కదా? చైతుకు జోడీగా మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకున్నారట. కానీ రకుల్ అక్కినేని నాగార్జున సరసన ‘మన్మధుడు 2’ సినిమాలో నటించేందుకు ఒకే చెప్పడంతో ఈ సినిమా ఆఫర్ మిస్ అయిందట. ఒకవైపు నాగ్ తో రొమాన్స్ చేస్తూ ఇటు చైతుతో రొమాన్స్ అంటే బాగుండదని నిర్మాత సురేష్ బాబు వేరే హీరోయిన్ ను చూడమన్నారట. దీంతో ‘నన్ను దోచుకొందువటే’ ఫేమ్ నభా నటేష్ కు హీరోయిన్ అవకాశం వచ్చిందని అన్నారు.

ఇప్పుడు అది కూడా మారిందట. నాగ చైతన్య తనకు హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు సూచించాడని సమాచారం. నభా కంటే రాశి ఖన్నాకు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉంటుంది. మరి చైతు పెదమామ సురేష్ బాబు ఆ బడ్జెట్ కు ఒకే అంటే రాశి కన్నా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టేనట.
Please Read Disclaimer