ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ వెన్నెల కిషోర్ చలవేనట!

0ఒక మనిషి లో ఉండే మరో టాలెంట్ ను గుర్తించడం చాలా కష్టం. బొమన్ ఇరాని యాక్టింగ్ లో ఏలెట్టే వరకు ఆయనకు నటన వచ్చని.. పవర్ స్టార్ కే వాళ్ళ అత్తను తీసుకురమ్మని చెప్పి.. ఆమె దగ్గరికి పంపించేంత సెంటిమెంట్ కురిపిస్తాడని ఎవరికి తెలుసు? అయన నలభై ఏళ్ల వరకూ ఎదో ఏదేదో జాబులు చేసుకుంటూ ఉన్నాడట. మరి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటారు గానీ వాళ్ళలోని టాలెంట్ ను గుర్తించే టాలెంట్ మనకు ఉండాలంతే. అయితే మనకు తెలుగులో ఇప్పుడున్న కమెడియన్స్ లో టాప్ కమెడియన్ ఎవరంటే టక్కున వెన్నెల కిషోర్ పేరు చెప్తారు.

కానీ కిషోర్ లో ఉండే మరో టాలెంట్ ఏంటో చెప్పమని వాళ్ళని అడిగితే మాత్రం అన్సర్ చెప్పలేరు. ఆ టాలెంట్ ఈమధ్యనే బయటకు వచ్చింది. కిషోర్ కత్తి లాంటి టైటిల్స్ సజెస్ట్ చేయడంలో దిట్ట అట! ఇప్పటివరకూ ఎన్ని టైటిల్స్ సజెస్ట్ చేశాడని మాత్రం అడగొద్దు. సుశాంత్ కొత్త సినిమాకు ‘చి ల సౌ’ అనే కొరియన్ సౌండింగ్ ఉన్న అచ్చ తెలుగు నామాన్ని సూచించిన ఘనత మన ఘనుడైన హాస్య నటుడిదేనని ఫిలిం నగర్ వేగుల సమాచారం.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథకు ఇలాంటి టైటిల్ ఐతే సరిగ్గా అతికినట్టుగా సరిపోతుందని వెన్నెల కిషోర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కు ఒక సజెషన్ ఇవ్వడం ఆ టైటిల్ అందరికీ నచ్చడం చక చకా జరిగిపోయాయట. సో.. టైటిల్స్ కావాలంటే ఇకనుండి మనవాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకునే అవసరం లేదు. వెన్నెల అన్నయ్యను ప్రేమగా అడిగితే అయన ఓ మంచి టైటిల్ ను సూచించే అవకాశం ఉంది.

ఈ టైటిల్ గోల పక్కన పెడితే – ‘చి ల సౌ’ సినిమాకు ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో మంచి బజ్ నెలకొంది. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి బ్యానర్ కూడా తోడవటంతో ఈ సారి సుశాంత్ ‘గట్టిగా కొడతా’డని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.