కన్ఫామ్!! ఆమే బసవతారకం

0ముందు నుంచి వినిపించిన మాటే నిజమైంది. తన తండ్రి – విఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవిత గాథతో హీరో బాలకృష్ణ చేస్తున్న హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ సినిమాలో బసవతారకం పాత్ర చేయబోతోందని ముందు నుంచి టాక్ వినిపించింది. అయితే విద్యాబాలన్ తన నిర్ణయాన్ని ఇంతకాలం పెండింగ్ లో పెట్టింది. రీసెంట్ గా ఆమె ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

పాత్ర ఏదయినా దానికి తన నటనతో ప్రాణం పోయడం విద్యాబాలన్ ప్రత్యేకత. అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆమె సాధించినన్ని హిట్లు ఈతరంలో ఇంకెవ్వరూ సాధించలేదు. కహాని.. డర్టీపిక్చర్.. తుమ్హారీ సులు వంటి సినిమాలు ఆమె ప్రతిభకు అద్దం పడతాయి. కెరీర్ లో సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన విద్యాబాలన్ కు సౌత్ నుంచి బోలెడు ఆఫర్లు వచ్చినా నో చెప్పేసింది. ‘‘ఎన్టీఆర్ జీవితంలో బసవతారకం చాలా కీలకమైన వ్యక్తి. సినిమాలు – రాజకీయాలతో ఎన్టీఆర్ తలమునకలై ఉన్నా 13 మంది సంతానాన్ని నేర్పుగా పెంచుకుంటూ వచ్చింది. ఎన్టీఆర్ విజయాలన్నింటి వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది. ఆమె గొప్పతనం అందరికీ తెలిసేలా బయోపిక్ లో రోల్ ఉంటుందని’’ యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో విద్కాబాలన్ తొలిసారిగా తెలుగు తెరపై కనిపించనుంది. ఇంతకు ముందు ఆమె ఓ మళయాళ సినిమాలోనూ నటించింది. పృథ్వీరాజ్ హీరోగా.. జెనీలియా హీరోయిన్ నటించిన ఉరుమి సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె సౌత్ సినిమాలో చేస్తోంది. డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.