నటి విద్యాబాలన్ కు రోడ్డు ప్రమాదం

0Vidya-Balan-in-Meena-Kumariబాలీవుడ్ నటి విద్యాబాలన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది. 38 ఏళ్ల విద్య ముంబైలోని బాంద్రాకు ఓ మీటింగ్ కోసం వెళుతుండగా… ఆమె కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్ అయినప్పటికీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ వివరాలను డీఎన్ఏ పత్రిక వెల్లడించింది.

ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయినప్పటికీ, చిన్ని గాయం కూడా తగలకుండానే విద్యా బాలన్ సురక్షితంగా బయటపడిందని డీఎన్ఏ తెలిపింది. ప్రస్తుతం విద్యాబాలన్ నటిస్తున్న ‘తుమ్హారీ సులూ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో ఆమె లేట్ నైట్ రేడియో జాకీ పాత్రను పోషిస్తోంది. నవంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.