స్టార్ హీరోల దీపావళి సమరం

0ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పోటీ తప్పనిసరిగా ఉంటుంది. స్టార్ హీరోల గురించి అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కోలీవుడ్ లో అయితే ఆ డోస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. హీరోల కన్నా అభిమానులే ఎక్కువ ఛాలెంజ్ చేసుకుంటారు. వారి అభిమాని హీరోల సినిమా విడుదలైతే పోటా పోటీగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ కోలీవుడ్ లో విజయ్ – సూర్య ఫ్యాన్స్ మధ్య రచ్చ మొదలవ్వనుంది.

విజయ్ 62వ సినిమా అలాగే సూర్య NGK సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. అంచనాలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ దీపావళికి ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సారి రానున్నట్లు చెప్పేశారు. ఎక్కువగా విజయ్ సినిమాలకు దీపావళికి మంచి సక్సెస్ సాధిస్తాయి. గతంలో కొన్ని సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మురగదాస్ దర్శకత్వం వహించడం మరొక ప్లస్ పాయింట్. కీర్తి సురేష్ ఆ సినిమాలో హీరోయిన్.

ఇక సూర్య NGK విషయానికి వస్తే.. విలక్షణ దర్శకుడు శ్రీ రాఘవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం కాయం. అయితే సూర్య మార్కెట్ విజయ్ కంటే కొంచెం తక్కువే అయినా ఈ దీపావళికి పోటీ తప్పకుండా ఇస్తాడని తెలుస్తోంది. ఇక సూర్య సరసన సాయి పల్లవి – రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరి హీరోల్లో దీపావళికి ఎవరు నెగ్గుతారో చూడాలి.