గోవిందం భలే ఎత్తాడు

0విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు రొమాంటిక్ హీరోనే కాదు… అంతకుమించి! ఆయన ఏ సినిమా చేసినా కథానాయికని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకొన్నాడో అన్న కోణంలో ఆలోచించేవాళ్లే ఎక్కువ. ఆయన స్టేట్ మెంట్లు కూడా అలానే ఉంటాయి. ఇమ్రాన్ హస్మీలాగా మీ సినిమాల్లో ముద్దు కంపల్సరీనా అని అడిగితే… “ప్రపంచంలో ఇమ్రాన్ హస్మీ ఒక్కడే ముద్దులు పెట్టుకోవాలా ఏంటీ? మనోళ్లు ఎవ్వరూ ముద్దులు పెట్టుకోవడం లేదో – కమాన్ యార్. ముద్దొస్తే ఎవ్వరైనా ముద్దు పెట్టుకుంటారు“ అంటూ తనదైన స్టైల్ లో జవాబిస్తుంటాడు. అయితే కథ రీత్యా `గీత గోవిందం`లో మాత్రం నేను చాలా మారిపోయాను – అయామ్ డీసెంట్ నౌ అంటున్నాడు. దాన్నిబట్టి సినిమాలో కూడా ఆయన డీసెంట్ గానే కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.

అయితే రొమాంటిక్ కోణం పరంగా మాత్రం ఆయన ఏమాత్రం తక్కువ చేయడనిపిస్తోంది. ఇప్పటిదాకా విడుదలైన టీజర్లు – పోస్టర్లని బట్టి చూస్తుంటే ఆ విషయం పక్కాగా రూడీ అవుతోంది. టైమ్ ఫ్లై అవుతోంది ఇక సినిమా విడుదలకి నాలుగు రోజులే అంటూ తాజాగా విజయ్ దేవరకొండ ఓ కొత్త పోస్టర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాన్ని చూస్తున్న నెటిజన్లంతా నీ చేతుల్లో అమ్మాయి కూడా బాగానే ఫ్లై అవుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ ఫొటోలో మాత్రం రొమాంటిక్ కోణం మరింత బలంగా కనిపిస్తోంది కదూ! ఎంతైనా గోవిందం తన గీతని భలే ఎత్తాడబ్బా!