అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో విజయ్ దేవరకొండ

0



vijay-devarakondaఅలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో రీల్‌ లైఫ్‌ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విజయ్‌ దేవరకొండ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆయన అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, విజయ్‌ మంచి స్నేహితులట. వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇందులో అలనాటి నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్‌ సల్మాన్‌ శివాజీ గణేశన్‌ పాత్రలోనటిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.