ఈ కుర్రాడే ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్..!

0vijay-devarakonda-childhoodఏమీ తెలియని అమాయకుడిలా కనిపిస్తున్న ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఈ కుర్రాడే హాట్ టాపిక్.. అయితే ఇప్పుడు ఇలా లేడులెండి. పోస్టర్, టీజర్ ల నుంచే వివాదాలకు కారణమైన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ చిన్ననాటి ఫోటో ఇది. అర్జున్ రెడ్డి సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండటంతో అందరి దృష్టి విజయ్ దేవరకొండ మీద పడింది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో ఏ సందర్భంలో దిగిందన్న విషయం తెలియకపోయినా.. సినీ జనాలు ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోనే కాదు.. ఆడియో ఫంక్షన్ లోనూ బోల్డ్ కామెంట్స్ తో షాక్ ఇచ్చిన కుర్రాడు ఒకప్పుడు ఇంత అమాయకంగా కనిపించేవాడంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.