రాజమౌళి నా తండ్రి.. సమంత నా మరదలు: విజయ్ దేవరకొండ

0Vijay-Devarakondaవిడుదలకు ముందే వివాదాస్పందంగా మారిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విడుదల తర్వాత మరింత వివాదాస్పదమవుతూ.. సంచలనాలు సృష్టిస్తోంది. ఒక వైపు సినిమాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పోరాడుతుంటే.. మరోవైపు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అర్జున్‌రెడ్డి సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ ఒక అడుగు ముందుకేసి వీహెచ్‌ను తాతయ్య అనేశాడు.

ముద్దు పోస్టర్‌తో వివాదాస్పందగా మరిన ఈ సినిమాను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించడంతో తాజాగా వీహెచ్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న మీరు.. డాక్టర్లే డ్రగ్స్ తీసుకుని ఆపరేషన్లు చేసే సినిమాకు ఎందుకు మద్దతిస్తున్నారు? డ్రగ్స్ కేసు మీద మీరు చేసిన హడావిడికి చెంపదెబ్బ కొడుతూ ఈ సినిమా తీశారు. అలాంటి సినిమాను మీ కుమారుడు చూశారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? హీరో మనవాడే.. మన కుటుంబ సభ్యుడే.. మన బంధువే.. వాడి సినిమా ఆడాలి అని మీ ఆలోచనా? డ్రగ్స్, ర్యాంగింగ్ నివారణకు మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ సినిమా విరుద్ధంగా కాబట్టి నేను చెబుతున్నా.. ఈ సినిమాలో ర్యాగింగ్ ఉంది. పెళ్లికి ముందే గర్భవతి అయ్యేలా చూపించారు. సమాజంలో పెళ్లి తర్వాత గర్భవతి అయితే ఈ సినిమాతో ఇప్పుడు కొత్త వాతావరణం మొదలైంది. మొదట ప్రగ్నెంట్.. తర్వాత పెళ్లి. ముఖ్యమంత్రి గారూ మీరు సినిమా చూడండి. మీకే తెలుస్తుంది. హనుమంతరావు చెప్పింది తప్పా? ఒప్పా? అని. ‘నేను డ్రగ్స్ తీసుకుని, డ్రింగ్ చేసి 300 ఆపరేషన్లు చేశాను’ అంటే అతడు రైటా? రాంగా? అనేది మీరే డిసైడ్ చేయండి.’’ అంటూ సీఎం కేసీఆర్‌కు హనుమంతరావు సూచించారు.

హనుమంతరావు వ్యాఖ్యలు విన్న విజయ్‌ దేవరకొండ తాజాగా ఫేస్‌‌బుక్‌లో వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రియమైన తాతయ్యా.. అర్జున్‌రెడ్డి సినిమాను అభినందించినందుకే కేటీఆర్ నా బంధువు అయితే.. మా సినిమాను ప్రశంసించిన రాజమౌళి గారు నా తండ్రి. రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు. నాకు సిస్టర్స్ అనే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి.. సమంత, అను ఇమ్మాన్యుయెల్, మెహ్రీన్ నా మరదళ్లు.

ఐదు రోజుల్లో ఐదు వేలకు పైగా షోలను ఫుల్ చేసిన నా స్టూడెంట్స్, సినిమా చూసిన స్త్రీ, పురుషులందరూ నా ట్విన్స్. ఇక ఆర్జీవీ సర్ అయితే మన ఇద్దరిలో ఎవరి ఫాదరో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సినిమాలను, ప్రజల మైండ్ సెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళుతుంటే.. కొంతమందేమో ఇంకా తొడగొట్టడం వద్దే ఆగిపోయారు.’’ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు విజయ్.