టాప్ స్టార్స్ క్లబ్ లో చేరిన దేవరకొండ!

0సక్సెస్ రాకముందు మనం ఎంతమాట్లాడినా విలువ ఉండదు.. మనం ఎంత మొత్తుకున్నా ఎవడూ నమ్మడు. సక్సెస్ వచ్చాక మనం అసలు నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా అల్టిమేట్ గా మాట్లాడేది మన ‘విజయం’ తప్ప మరోటి కాదు. సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ విలువ మరింత ఎక్కువగా ఉంటుంది. మన టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడాలంటే టాపిక్ ఎక్కడ మొదలు పెట్టినా వచ్చి ఆగేది మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డుల దగ్గరే.

ఇక అలాంటి రికార్డుల లిస్టు లో ప్రభాస్ అందరికంటే ఎత్తులో ఉన్నాడు. రికార్డుల లిస్టు నుండి ప్రభాస్ ను తప్పించడానికి నాన్-బాహుబలి అని కొత్త కేటగిరీ ని కనిపెట్టారు కొందరు తెలివైన జనాలు. మరి ఇతర టాప్ లీగ్ హీరోల విషయానికి వస్తే రామ్ చరణ్ – చిరంజీవి – మహేష్ బాబు – ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఇలా అందరూ రూ. 60 – 120 కోట్ల వరకూ వివిధ కేటగిరీల్లో షేర్ క్లబ్ లో ఉన్నారు. స్టార్టింగ్ రేంజ్ రూ. 60 కోట్ల షేర్ అనుకుంటే ఆ క్లబ్ లో కి టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఎంటర్ అయ్యాడు.

విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ రూ. 60+ కోట్ల షేర్ క్లబ్ లో ఈ మధ్య ఎంటర్ అయింది. ఈ ఫీట్ సాధించేందుకు ‘గీత గోవిందం’ సినిమాకు 15 రోజులు పట్టింది. ఈ సినిమాతో విజయ్ పెరిగిన మార్కెట్ స్టామినాను అందరూ గుర్తించారు. కానీ విజయ్ కనుక నెక్స్ట్ సినిమాలతో కనుక రూ. 30 – 40 కోట్ల షేర్ సాధించగలిగితే పర్మనెంట్ గా టాప్ లీగ్ స్టార్స్ లిస్టు లో స్థానం సంపాదించినట్టే. దీంతో అందరి దృష్టి ‘నోటా’.. ‘టాక్సీవాలా’ లపై పడింది.