అర్జున్ రెడ్డికే పిచ్చి లేపిన ట్రైలర్

0లేటెస్ట్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రచ్చ చూస్తున్నాంగా. గీత గోవిందం మూడో వారంలోకి అడుగు పెట్టినా ఇంకా పూర్తి స్థాయిలో బ్రేకులు పడలేదు. దాన్ని మరిపించే బలమైన అపోజిషన్ సినిమా ఏది లేకపోవడం పెద్ద ప్లస్ గా మారింది. ఇప్పుడు తను ఏదైనా మాట్లాడినా ట్వీట్ చేసినా యూత్ కి హాట్ టాపిక్ గా మారుతోంది. అలాంటిది విజయ్ కే ఓ ట్రైలర్ పిచ్చిగా నచ్చడమే కాదు నాకు నీతో పని చేయాలని ఉందని ఆ దర్శకుడికే మెసేజ్ పెట్టేలా చేసింది. అదే మర్ద్ కో దర్ద్ నహీ హోతా. ఇంగ్లీష్ లో ది మ్యాన్ హూ ఫీల్స్ నో పెయిన్. తెలుగులో చెప్పాలంటే నొప్పి తెలియని ఓ మగాడి కథ ఇది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా టోరెంటో మూవీ ఫెస్టివల్ కి అఫీషియల్ ఎంట్రీ దక్కించుకుంది. విజయ్ దీని గురించి ప్రస్తావిస్తూ ట్రైలర్ చూసి వెర్రెక్కిపోయానని నేనే అందులో ఉన్నట్టు ఫీలవుతున్నానని చెబుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

అంత మహత్యం ఇందులో ఏముంది అనుకుంటున్నారా. ఆటిట్యూడ్ ని విభిన్నంగా ప్రెజెంట్ చేయటాన్ని ఇష్టపడే విజయ్ దేవరకొండకు ఇందులో హీరో పాత్ర విలక్షణంగా అనిపించడంతో బాగా కనెక్ట్ అయిపోయాడు. అసలు ఎంత పెద్ద దెబ్బ తగిలినా రక్తం కారినా ఏ మాత్రం నొప్పి లేకుండా తన పనులు తాను చేసుకుపోయే పాత్రలో అభిమన్యు దాసాని చాలా వెరైటీగా ఉన్నాడు. రోన్ని స్క్రూవాలా నిర్మించిన ఈ మూవీని హిందీ ఇంగ్లీష్ లలో విడుదల చేయబోతున్నారు. రాధికా మదన్-గుల్షన్ దేవయ్య-మహేష్ మంజ్రేకర్-జిమిత్ త్రివేది కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని సహజత్వం కోసం 35 ఎంఎంలో షూట్ చేయటం విశేషం. విజయ్ దేవరకొండకు ఇంత పిచ్చగా నచ్చేసింది అంటే దీని కోసం అతని అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూడటంలో తప్పేముంది.