మాట తప్పుతానేమో అంటున్న దేవరకొండ

0

Vijay-Devarakonda-on-About-His-Upcoming-Moviesటాలీవుడ్లో ఇప్పుడు చాలా బిజీగా ఉన్న.. తిరుగులేని డిమాండ్ ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ‘పెళ్లిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’.. ‘గీత గోవిందం’ సినిమాలు ఘనవిజయాలు సాధించడంతో అతడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అతడి కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. అతడికి అరడజను దాకా కమిట్ మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయడానికి 2020 చివరి వరకు అవుతుందని అంటున్నాడు విజయ్. ఇప్పుడు కూడా తనను చాలామంది దర్శకులు కథలతో కలుస్తున్నారని.. కానీ ఎవరికీ కమిట్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని విజయ్ అన్నాడు. అసలు తాను ఆల్రెడీ కమిటైన సినిమాలు కూడా అన్నీ చేస్తానో లేదో తెలియట్లేదని.. మాట తప్పుతానేమో అని భయంగా ఉందని విజయ్ తెలిపాడు.

తన ఆలోచనలు ఎప్పుడూ ఒకలా ఉండవని విజయ్ చెప్పాడు. ఈ రోజు తనను ఎగ్జైట్ చేసే ఒక కథ.. ఏడాది తర్వాత అంత బాగా అనిపించకపోవచ్చని.. అప్పటి పరిస్థితులు.. తన ఆలోచనల ప్రకారం అభిప్రాయం మారిపోతుందని.. అందుకే తాను ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తాననే నమ్మకం తనకు లేదని అన్నాడు విజయ్. తనను కలిసే దర్శకులతో కూడా ఇదే మాట చెబుతున్నానని.. ఇప్పుడు ఓకే చెప్పినా.. ఆ తర్వాత తనకు ఎగ్జైట్మెంట్ లేకుంటే రాజీ పడి సినిమా చేసే అవకాశమే లేదని అతను స్పష్టం చేశాడు. ఐతే తన కోసం అంత కాలం ఎదురు చూసి సినిమా చేయనంటే వాళ్లకూ బాధే అని.. ఇదంతా టైం వేస్ట్ వ్యవహారం అవుతుందని.. ఈ విషయం తాను దర్శకులకు ముందే చెబుతున్నానని విజయ్ తెలిపాడు. ఈ మాట చెప్పినా కొందరు తనతో సినిమాలు చేయడానికి సిద్ధ పడుతున్నారని అన్నాడు. కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తుండటంతో.. కొంచెం బ్రేక్ తీసుకుని తాజాగా తయారవ్వాలని అనిపిస్తున్నట్లు విజయ్ తెలిపాడు.
Please Read Disclaimer