టైం వచ్చినప్పుడు చెబుతానన్న విజయ్

0

Vijay-Devarakonda-on-About-His-Viral-Picsగీత గోవిందం సూపర్ సక్సెస్ తర్వాత దానికి పూర్తిగా సంబంధం లేని రాజకీయ నాయకుడి పాత్రలో తాను నటించిన నోటా అక్టోబర్ 5 విడుదల అవుతున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. చెన్నైలో చేస్తూనే మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా జరిగిన ఒక ముఖాముఖీలో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన బెల్జియం యువతీతో చనువుగా ఉన్న ఫోటోల ప్రస్తావన వచ్చింది.

దానికి తెలివిగా సమాధానం చెప్పిన విజయ్ ఫోటోలు చూసారు కాబట్టి మీరేదో ఊహించుకోవడం సహజమని అలాంటిది ఏదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటిస్తానని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఏదో ఒక డ్రామా లేనిదే లైఫ్ చప్పగా ఉంటుందని అందరు నాకు సంబంధించి ఇదే అనుకుంటున్నారని ప్రస్తుతానికి ఇలా కానివ్వండి అంటూ తప్పుకున్నాడు.

నిజానికి వాటి గురించి నో కామెంట్స్ అనో లేక పుకారని అంటాడనో ఊహించారు కొందరు. అలా చేస్తే విజయ్ దేవరకొండ ఎందుకు అవుతాడు. ఇక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే ఏదో ఉందన్న ఊహాగానాలకు కొంత బలం చేకూరినట్టే అని చెప్పొచ్చు. నోటా మీద కుర్రాడికి చాలా నమ్మకం ఉంది. డిఫరెంట్ జానర్ కాబట్టి అభిమానులు కూడా చాలా ఆశిస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి.

ఇది కూడా హిట్ అయితే విజయ్ జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడటం కష్టమే. ఇది వచ్చిన తక్కువ గ్యాప్ లోనే టాక్సీ వాలా వచ్చే అవకాశం ఉంది. పైరసీ విషయంలో మరోసారి కలకలం రేగడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా విడుదల చేసే ఏర్పాట్లలో ఉన్నారు నిర్మాతలు. ఇది ఫైనల్ అయితే ఈ మూడు నెలల్లో విజయ్ దేవరకొండ సినిమాలు రెండు వస్తాయి.
Please Read Disclaimer