గీత బ్రేక్ అప్ గురించి గోవింద్!

0

రేపు విడుదల కాబోతున్న నోటా ప్రమోషన్ కోసం కాళ్లకు చక్రాలు కట్టుకు తిరుగుతున్నాడు విజయ్ దేవరకొండ. నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి విడుదల కానుండటంతో ప్రతి చోటా తన ప్రెజెన్స్ ఉండేలా ముఖ్య నగరాలన్నీ రౌండ్లు వేసేస్తున్నాడు. ఇందులో భాగంగా బెంగుళూరులో జరిగిన ప్రెస్ మీట్ లో మాత్రం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదురుకున్నాడు విజయ్. ఓ మీడియా ప్రతినిధి రష్మిక మందన్న రక్షిత్ శెట్టిల బ్రేక్ అప్ గురించి ప్రశ్నించి గీత గోవిందం సినిమా నుంచి లీక్ అయిన లిప్ లాక్ సీన్ వల్లే ఇదంతా జరిగింది అని అడగడంతో కాస్త షాక్ తిన్న విజయ్ క్షణాల్లో తేరుకుని చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.

ఈ ఇష్యూ గురించి తాను కామెంట్ చేయకూడదని మూడో వ్యక్తినైన తాను ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో జరిగిన దాని గురించి బయటికి చెప్పమనడం సబబు కాదని తేల్చి చెప్పేశాడు. ఇక లీక్ అయిన సీన్ వల్ల తాము చాలా బాధ పడ్డామని అయినా ఇదంతా సినిమాలాగే నిజ జీవితం కూడా డ్రామాలా ఉంటుందని వాస్తవాన్నీ అంగీకరించి ముందుకు వెళ్లడమే మనం చేయగలిగింది అని వేదాంత ధోరణిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అక్కడితో వదల్లేదు శాండల్ వుడ్ మీడియా. బెల్జియం అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు అందులో కుటుంబం ఉండటం గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం నేరుగా సమాధానం చెప్పకుండా స్మార్ట్ గా తప్పించుకున్నాడు విజయ్. రష్మిక మందన్న గురించి ప్రశ్నలు ఎదురుకావడానికి కారణం ఒకటే.

ఇప్పటికీ కర్ణాటకలో రష్మిక రక్షిత్ ల బ్రేక్ అప్ వివాదం పూర్తిగా చల్లారలేదు. తెలుగు సినిమాల అవకాశాల కోసమే రష్మిక ఇలా చేసిందన్న కామెంట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. గీత గోవిందం లీకైన సీన్ చేసిన రచ్చ కూడా చిన్నదేమీ కాదు. అందువల్లే విజయ్ దేవరకొండ సరిగ్గా దొరకడంతో టైం చూసి ఈ ప్రశ్నలు అడిగేసారు. రేపు నోటా నాలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. విజయ్ కెరీర్ లోనే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. పోటీ పెద్దగా లేకపోవడంతో ఓపెనింగ్స్ పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
Please Read Disclaimer