తెలంగాణ హీరోతో రాయలసీమ అమ్మాయి..

0Vijay-Devarakonda-Priyankaఅర్జున్ రెడ్డి సినిమా వివాదాలకు కేంద్రమైనా.. వసూళ్ల పరంగా అదరగొట్టింది. అలాగే ఈ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండకి మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. యూత్‌లో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు లభించింది. ఈ క్రేజుతో అరడజను పైగా కొత్త ప్రాజెక్టులను అర్జున్ రెడ్డి కైవసం చేసుకున్నాడు. విజయ్ దేవర కొండ రాహుల్ అనే కొత్త దర్శకుడితో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఒక సినిమా చేయడానికి సంతకం చేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.

ఇక విజయ్ దేవరకొండతో చేయడానికి చాలామంది హీరోయిన్స్ రెడీగా వున్నారు. అయినా ఈ సినిమాలో రాయలసీమకు చెందిన ప్రియాంకా జవాల్కర్ అనే కొత్త అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకున్నారు. అర్జున్ రెడ్డి ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం మాత్రమే వుందని.. అర్జున్ రెడ్డి సరసన జోడీ కడితే అమ్మడుకు మంచి క్రేజు లభిస్తుందని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. ఎందుకంటే? ఇప్పటికే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టిన షాలినీ పాండే వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.