రాజా ది రాజా.. విజయ్ కి ఇది ఫిక్స్

0

Vijay--Devarakonda-puts-His-Tagline-Raja-Dhi-Rajaవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. అక్టోబర్ 5న ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాలు – తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ తనకు తానుగా రాజా ది రాజా అని చెప్పేసుకున్నాడు.

‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ అయిన విజయ్ దేవరకొండ – ‘గీత గోవిందం’ చిత్రంతో అతి సుభంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. దాంతో ఈయనకు సూపర్ పవర్ స్టార్ అనే బిరుదు ఇవ్వాలని కొందరు ప్యాన్స్ అనుకున్నారు. వారు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను సూపర్ పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటున్నారు. అయితే విజయ్ మాత్రం తనకు తానుగా రాజా ది రాజా అంటూ చెప్పుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజా ది రాజా విజయ్ దేవరకొండ అంటూ తనను తాను సంభోదించుకున్నాడు.

రాజా ది రాజా కంటే దేవా ది దేవా చాలా బాగుంది కదా అంటూ మీడియా ప్రతినిధి అనగా విజయ్ నవ్వుతూ ఇలాంటివి పెట్టుకుందాం అనేశాడు. విజయ్ అభిమానులు ఇకపై రాజా ది రాజా లేదా దేవా ది దేవా అంటూ పిలవాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను వివిధ రకాల బిరుదులతో పిలిచేస్తున్నారు. తాజాగా ఈ కొత్త బిరుదులు ఆ జాబితాలో చేరిపోతాయి. నోటా సక్సెస్ అయితే విజయ్ దేవరకొండ స్థాయి మరింతగా పెరగడం ఖాయం.
Please Read Disclaimer