ఓవర్ నైట్ స్టార్ కాదంటున్న దేవరకొండ

0

విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో టాలీవుడ్ కి కొత్త స్టార్ వచ్చాడని కూడా అంటున్నారు. విజయ్ తాజా చిత్రం ‘నోటా’ అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

మీరు ఓవర్నైట్ లో ఎక్కడికో వెళ్ళిపోయారనిపిస్తోంది అని అడిగితే.. దానికి విజయ్ సమాధానం ఇస్తూ ఓవర్ నైట్ అని ఎందుకంటారో తెలీదని అన్నాడు. “నేను ఎప్పటినుండో కష్టాలు పడుతున్నా. రెండేళ్ళు తిరిగితే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అవకాశం వచ్చింది” అన్నాడు. ‘పెళ్ళి చూపులు’ సినిమా నుండి తన పేరు తెలుసనీ.. చాలామందికి మాత్రం ‘అర్జున్ రెడ్డి’ నుంచే తెలిసిందని.. అందుకే వాళ్ళు త్వరగా స్టార్ అయ్యాననే అనుకుంటారు. వాళ్ళకే కాదు తనక్కూడా అలా అనిపిస్తుందట.

ఇక తమిళం అంత త్వరగా నేర్చుకున్నారు అని ఆడిగితే.. పొద్దున సాయంత్రం కూర్చుని చదువుకుంటూ కష్టపడి నేర్చుకున్నానని చెప్పాడు. అంతే కాదు.. రానా.. నాగ చైతన్యలు ‘చిన్నపుడు చెన్నై లో ఉన్నాం కదా అందుకే తమిళం వచ్చు’ అంటారని .. వాళ్ళకు సులభంగా వచ్చేసిందని.. తనకు మాత్రం కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చిందని అన్నాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరితో క్లోజ్ గా ఉంటారు అని అడిగితే “రానా ను కలుస్తుంటాను అయన ఎప్పుడూ కూల్ గా ఉంటారు. ఇక నాని తో ‘ఎవడే సుబ్రమణ్యం’ నుండి ప్రయాణం చేస్తున్నా కాబట్టి కంఫర్టబుల్ గా ఫీలవుతానని అన్నాడు. తరుణ్ భాస్కర్.. సందీప్ రెడ్డి వంగా పర్సనల్ గా క్లోజ్ అన్నాడు. ఇక నాగ్ అశ్విన్.. స్వప్నా దత్.. కూడా క్లోజ్ గా ఉంటారు అన్నాడు. ఇక తారక్ అన్న బన్నీ అన్నలను కూడా కలిశానని.. వాళ్ళకు తన వర్క్ నచ్చిందని.. ఇంటికి పిలిచి అభినందించి ప్రోత్సహిస్తుంటారని అన్నాడు.
Please Read Disclaimer