విజయ్ దేవరకొండ కు హాలీవుడ్ ఫ్రెండ్!

0

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’ నవంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ తో ఓ కొత్త కుర్రాడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనేది అలాంటి వాటిలో ఒకటి.

‘టాక్సీవాలా’ లో ‘హాలీవుడ్’ అనే పాత్ర పోషిస్తున్న ఆ నటుడు రియల్ లైఫ్ లో విజయ్ దేవరకొండ ఫ్రెండేనట. ఈ సినిమాకు తనను రెఫర్ చేసింది విజయ్ దేవరకొండేనట. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన నటులు చాలా పాపులర్ అయ్యారు. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో ప్రియదర్శికి మంచి రికగ్నిషన్ లభించగా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో రాహుల్ రామకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఇద్దరూ కమెడియన్స్ బిజీగా మారిపోయారు. ‘టాక్సీవాలా’ తో ఈ విజయ్ ఫ్రెండ్ కూడా పాపులర్ అవుతాడో లేదో వేచి చూడాలి.

ఇక ‘టాక్సీవాలా’ సంగతి మాట్లాడుకుంటే మొదట్లో బజ్ తక్కువగా ఉందిగానీ ఇప్పుడు ప్రమోషన్స్ తో స్లోగా సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని సిడ్ శ్రీరాం పాడిన ‘మాటే వినదుగా’ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ ‘పాస్తా’ ప్రమోషనల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
Please Read Disclaimer