“ఈ నగరానికి ఏమైంది?” లో విజయ్ దేవరకొండ

0“పెళ్లిచూపులు” ఫేమ్ అయినా తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వస్తున్న రెండొవ చిత్రం “ఈ నగరానికి ఏమైంది?” యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సురేష్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి “యూ/ఏ” సర్టిఫికెట్ దక్కింది.

ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతుండటంతో ఈ చిత్రానికి సంభందించిన ప్రచార కార్యక్రమాలు జోరు అందుకున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విజయదేవరకొండ క్యామియో రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తరుణ్ భాస్కర్ తీసిన “పెళ్లిచూపులు”తో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న విజయ్ ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో క్యామియోకి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే విజయ్ క్యామియో రోల్ నిడివి ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లోని యువకులు పడే కష్టాలను తరుణ్ భాస్కర్ చాలా హ్యూమరిక్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది.