నిర్మాత అవతారమెత్తిన దేవరకొండ

0

Vijay-Devarakonda-Turns-As-Producerటాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘నోటా’ అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరస విజయాలతో విజయ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతూ ఉండడంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘నోటా’ టీమ్ కూడా తీరిక లేకుండా ప్రమోషన్ కార్యక్రమాలలో గడుపుతూ సినిమాపై బజ్ ను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా ‘నోటా’ టీమ్ హైదరాబాద్ లో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఒక సర్ ప్రైజ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. త్వరలో సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతున్నానని తన బ్యానర్ పేరు ‘కింగ్ అఫ్ ది హిల్’ అని ప్రకటించాడు. ‘నోటా’ ఈవెంట్ లో ఈ ప్రకటన చేసేందుకు అనుమతినిచ్చిన నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు తెలిపాడు. మరి ఎలాంటి సినిమాలు నిర్మిస్తాడు.. ఎప్పుడు మొదటి సినిమా ప్రారంభం అవుతుంది లాంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఇక ‘నోటా’ గురించి మాట్లాడుతూ ఈ సినిమా తెలంగాణాలో ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ఉంటుందని అంటూ కొంతమంది విడుదలను అడ్డుకునేందుకు ప్రయతనం చేస్తున్నారని.. కేసులు పెడుతున్నారని కానీ అలాంటిదేమీ లేదని అన్నాడు. అదేగనుక వారు తనను కలిసినట్టయితే వారికి నిజానిజాలు వివరించే వాడినని అన్నాడు. ‘నోటా’ సినిమాకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని.. సమర్థులైన నాయకులను ఎన్నుకునే దిశగా ప్రజలను ప్రేరేపిస్తుందని అన్నాడు.
Please Read Disclaimer