మరో లవ్ స్టోరీతో రానున్న విజయ్

0vijay-devarakonda-new-love-ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టేస్తున్నారు, సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నారు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌ రెడ్డి’ ఇచ్చిన సక్సెస్‌తో వరుసగా సినిమాలు సైన్‌ చేస్తూ దూసుకెళ్తున్నారీ యంగ్‌ హీరో. విజయ్‌ కమిట్‌ అయిన వాటిలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ డైరెక్షన్‌లో సినిమా ఒకటి. చక్కని లవ్‌ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు క్రాంతి మాధవ్‌.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌లో మొదలు కానుందట. ప్రీ–ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శకుడు క్రాంతి మాధవ్‌. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’లోనూ విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారు. ‘మహానటి’లో జర్నలిస్ట్‌గా, పరుశురామ్‌ సినిమాలో టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.