ముగ్గురు దేవరకొండలు ఒకే చోట

0

Vijay-Devarakonda-with-His-Brother-Anand-Devarakondaటాలీవుడ్ అంతా ఇప్పుడు విజయ్ దేవరకొండ నామస్మరణే. ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ విజయం తాలూకు హ్యంగోవర్ ఇంకా పూర్తిగా దిగక మునుపే ‘నోటా’ విడుదలకు సిద్ధం అవుతుండడంతో సినిమా పై క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. ‘నోటా’ తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం కావడంతో ఇప్పటికే చెన్నైలో తమిళ వెర్షన్ ప్రమోషన్స్ పూర్తి చేసి తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు విజయ్.

నిన్న హైదరాబాద్ లో ‘నోటా’ పబ్లిక్ మీట్ జరిగింది. విజయ్ నాన్నగారు దేవరకొండ గోవర్ధన్ రావు.. తమ్ముడు ఆనంద్ కూడా ఈ పబ్లిక్ మీట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాన్నగారు గోవర్ధన్ రావు- తమ్ముడు ఆనంద్ తో కలిసి విజయ్ ఫోటోలకు పోజిచ్చాడు. ఈ పబ్లిక్ మీట్ లో ఈ ఫోటోనే మేజర్ హైలైట్. విజయ్ నాన్నగారు గతంలో పలు టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించారని సమాచారం. ఏదేమైనా విజయ్ నాన్నగారికి తనయుడు సక్సెస్.. క్రేజ్ చూడడం మాత్రం గర్వపడే సందర్భమే. మరో వైపు తమ్ముడు ఆనంద్ త్వరలో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇక ‘నోటా’ అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా కూడా ‘గీత గోవిందం’ లాగా బ్లాక్ బస్టర్ విజయం సాధించి విజయ్ దేవరకొండ రేంజ్ ను మరో లెవెల్ కు తీసుకెళుతుందేమో వేచి చూడాలి.
Please Read Disclaimer