తమ్ముడి గురించి అడగొద్దన్న దేవరకొండ

0సినీ రంగంలో ఒక వ్యక్తి నిలదొక్కుకుంటే చాలు.. ఇక అతడి కుటుంబ సభ్యులు సన్నిహితులు ఒక్కొక్కరే ఈ రంగంలోకి వచ్చేస్తారు. ఈ వారసత్వ ట్రెండ్ గత కొన్నేళ్లలో బాగా ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హీరోల అల్లుళ్లు సైతం తెరంగేట్రం చేస్తున్న వైనం చూస్తున్నాం. అలాగే హీరోల తమ్మళ్లు హీరోలు కావడం అన్నది ఎప్పట్నుంచో ఉన్నదే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తిరుగులేని ఇమేజ్ సంపాదించి.. యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఇంటి నుంచి కూడా మరో కుర్రాడు తెరంగేట్రం చేస్తున్నాడు. అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ అనే సినిమాతో హీరోగా పరిచయం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాత సురేష్ బాబ.. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్షన్లో ఈ సినిమాను నిర్మించనున్నాడట. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం అవుతుందట. ఐతే తన తమ్ముడి గురించి మాట్లాడటానికి విజయ్ దేవరకొండ ఇష్టపడకపోవడం విశేషం.

‘గీత గోవిందం’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన విజయ్ ను తమ్ముడి తెరంగేట్రం గురించి అడిగితే.. తాను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదన్నాడు. తాను తన గొడవలో ఉన్నానని.. తన తమ్ముడి సంగతి అతనే చూసుకుంటాని.. తాను తన తమ్ముడి గురించి ఏం మాట్లాడతానని అతను అక్కడితో ఆ చర్చను కట్ చేశాడు. ఐతే విజయ్ బ్యాకప్ లేకుండానే ఆనంద్ హీరో అయిపోతున్నాడని ఎవ్వరూ అనుకోవట్లేదు. మరోవైపు విజయ్ సొంతంగా ప్రొడక్షన్ హౌజ్ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఓవైపు గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్.. స్టూడియో గ్రీన్.. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లలో నటిస్తూ సొంతంగా నిర్మాణ సంస్థను పెట్టడానికి విజయ్ రెడీ అయిపోవడం విశేషమే. ఐతే అతను సొంతంగా కాకుండా వేరే బేనర్ల భాగస్వామ్యంలో సినిమాలు నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం.