15 రోజుల తర్వాత హాయిగా నిద్రపోయా

0

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘నోటా’ త్వరలో విడుదల కానుంది. రిలీజ్ కు నాలుగు రోజులే ఉండడంతో విజయ్ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం కావడంతో చెన్నైలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. తాజాగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

‘నోటా’ గురించి మట్లాడుతూ ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ సమయంలో ‘నోటా’ కథ విన్నానని.. వెంటనే నచ్చిందని చెప్పాడు. రాజకీయాలనేవి అందరి జీవితాలని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయని.. మన ఇంట్లోనే కాదు బయట మార్నింగ్ వాక్ కు వెళ్ళిన అంకుల్స్ కూడా రాజకీయలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుకుంటూ ఉంటారని అన్నాడు. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నానని తెలిపాడు. ఒకేరకమైన రోల్స్ చేస్తే బోర్ కొడుతుందని అందుకే ప్రతి సినిమాకు కొత్త క్యారెక్టర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు.

ఇక షూటింగ్ షెడ్యూల్స్.. ప్రమోషన్స్ తో బిజీగా ఉండడంతో సరిగా నిద్రపోవడం లేదని.. 15 రోజుల తర్వాత నిన్నే హాయిగా నిద్రపోయానని తెలిపాడు. ఇక గడ్డం పెంచుతున్న విషయం అడిగితే.. తన కొత్త చిత్రంలో గడ్డంతో కనిపించాల్సిన సీన్స్ ఉన్నాయని.. ఒక ఐదు రోజులపాటు పెంచితే సరిపోతుందని.. ఇప్పుడు ఎలాగూ టైమ్ ఉంది కదా అని పెంచుతున్నానని అన్నాడు.
Please Read Disclaimer