విజయ్ ని చెత్త స్టోరీలతో వేధించారట!!

0

Vijay-Deverakonda-on-About-movie-Scriptsఎంత చెట్టుకంత గాలి. ఇది అందరికీ తెలిసిన సామెతే కానీ జనాలు మాత్రం వాళ్ళ చెట్టుకు మాత్రమే గాలి ఉంటుందని అవతలోడి చెట్టుకు గాలి ఉండదని అనుకుంటూ ఉంటారు. మరి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రేజీ హీరో గానీ మొదట్లో సాధారణ హీరోనే.. రెండేళ్ళు అవకాశం కోసం తిరిగితేనే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లో మొదటి అవకాశం వచ్చిందని చెప్పాడు.

ఇక ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కంటే ముందు తనకెదురైన ఫ్రస్ట్రేషన్ గురించి రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. ఎన్నో రకాల పిచ్చి స్టోరీలు.. చెత్త స్టొరీలు తన వద్దకు రావడంతో వాటి బాధ పడలేక ఫ్రస్ట్రేషన్ తో తనే రైటర్ గా మారి కథలు రాసి.. దర్శకుడు అవుదామని డిసైడ్ అయ్యాడట. అలా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సమయంలో రెండు స్టొరీలు కూడా రాసి పెట్టాడట. కాకపొతే ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత తన వద్దకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలు రావడం మొదలైందట.. అవి నచ్చడంతో అన్నీటినీ యాక్సెప్ట్ చేశానని అందుకే ఇప్పుడు గ్యాప్ లేకుండా వరసగా సినిమాలు వస్తున్నాయని తెలిపాడు.

ఇప్పుడు మంచి స్టొరీలు తనవద్దకు వస్తుండడం తో ఒక విషయం అర్థం అయిందట. మన రచయితలు అప్పుడు కూడా మంచి స్టొరీలు రాసినా అవన్నీ వేరే హీరోల దగ్గరే ఫిల్టర్ కావడం తో తన దగ్గరకు చెత్త స్టోరీలు వచ్చాయని తెలుసుకున్నాడట. అందుకే ఇప్పుడు స్టొరీల విషయంలో సెలెక్టివ్ గా మారానని చెప్పాడు.
Please Read Disclaimer