లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా అరెస్ట్

0Vijay-mallyaమనీలాండరింగ్ కేసులో లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు విజయ్‌మాల్యాను లండన్‌లో అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. విజయ్ మాల్యా ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పులు చేసి..ఎగనామం పెట్టి లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే.

పీఎంఎల్‌ఏ కింద గతేడాది ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాల్యాపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాల్యా కు చెందిన రూ.9,600 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఏడాదిన్నర క్రితం లండన్‌కు పారిపోయిన మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించడానికి ఈడీ, సీబీఐ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది.