సంచలన దర్శకుడికి నో చెప్పిన అర్జున్ రెడ్డి…

0అర్జున్ రెడ్డి మూవీ తో యూత్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ హీరో అయ్యాడు. ప్రస్తుతం రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు మహానటి మూవీ లో నటిస్తున్నాడు. ఇవే కాక మరికొన్ని తెలుగు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అలాగే తమిళ భాషల్లో తెరకెక్కుతున్న నోటా షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు.

ఈ లోపు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , విజయ్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడట. అయితే ప్రస్తుతం వర్మ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా విజయ్, వర్మ సినిమాకు నో చెప్పాడని వినికిడి. మరికొంతమంది మాత్రం ఫామ్ లో లేని వర్మ దర్శకత్వం లో సినిమా చేసి అపకీర్తి తెచ్చుకునే బదులు ఆ సినిమా చేయకపోవడమే మంచిదనే నిర్ణయం తో డేట్స్ పేరుతో తప్పుకున్నాడనే మాట వినిపిస్తుంది. ఇక వర్మ ప్రస్తుతం నాగార్జున తో ఆఫీసర్‌ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.