సేతుపతి రెండో తెలుగు సినిమా ఇదే!

0

కోలీవుడ్ సెన్సేషన్ అనిపించుకున్న విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘సైరా’ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతికి ఇదే టాలీవుడ్ డెబ్యూ. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాకు సైన్ చేశాడు సేతుపతి. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.

గతంలోనే విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతికి వెల్కం చెప్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ క్రేజీగా మారిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వైష్ణవ్ సినిమాకు మామూలుగా అయితే తెలుగులో మాత్రమే మార్కెట్ ఉండేది. ఇప్పుడు విజయ్ సేతుపతి నటిస్తూ ఉండడంతో ఈ సినిమా రేంజ్ పెరిగింది.. తమిళంలో కూడా క్రేజ్ ఏర్పడుతుంది.

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మే లో ప్రారంభం కానుంది.
Please Read Disclaimer