చిల్లర రైట్స్ కే రూ. 50 కోట్లు

0

స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రైట్స్ వందల కోట్లు బిజినెస్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ ఆన్ లైన్ రైట్స్ ను చిల్లర(ఇతరత్ర) రైట్స్ గా చెబుతూ ఉంటారు. చిన్న హీరోల సినిమాలకు ఈ రైట్స్ విలువ లక్షల్లోనే ఉంటుంది. కాని స్టార్ హీరోల సినిమాలకు ఈ చిల్లర రైట్స్ కూడా కోట్లు పలుకుతూ ఉంటాయి. ఈ చిల్లర రైట్స్ కాస్త ఇప్పుడు కోట్లు కురిపించే రైట్స్ గా మారిపోయాయి. ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ కు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు కాని పెరిగిన పోటీ కారణంగా కోట్లు కురుస్తున్నాయి.

తాజాగా విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శాటిటైల్ రైట్స్ మరియు ప్రైమ్ వీడియో రైట్స్ ను నిర్మాతలు అమ్మేయడం జరిగిందట. ఆ రైట్స్ ను ఒక ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్ గుండు గుత్తగా 50 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రైట్స్ ద్వారా చిత్ర బడ్జెట్ దాదాపుగా పూడి పోయిన నేపథ్యంలో ఇక అసలు రైట్స్ అయిన థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎంత భారీ మొత్తంలో బిజినెస్ జరుగుతుందో అనే చర్చ జరుగుతోంది.

విజయ్ – అట్లీల కాంబినేషన్ కు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దానికి తోడు ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించడం వల్ల కూడా అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ కారణంగా ఈ చిత్రంకు ఇంత భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం మొత్తంగా 220 నుండి 235 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. విజయ్ సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నాడు అనేందుకు ఇదే నిదర్శణం అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer