చెంపదెబ్బే విజయం : వీడియో సాంగ్

0

ఇంకో వారంలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ విషయంలో వర్మ ఎక్కడా తగ్గడం లేదు. వాస్తవానికి 22కే ప్లాన్ చేసినా సెన్సార్ తో పాటు టిడిపి తెలిపిన అభ్యంతరం వల్ల కోర్ట్ కేసులతో ఆలస్యం జరగడంతో 29కి షిఫ్ట్ చేయక తప్పలేదు. ఇదిలా ఉండగా దీనికి సంబందించిన మరో వీడియో సాంగ్ ని వర్మ తాజాగా రిలీజ్ చేశాడు. లక్మి పార్వతిని ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నాక టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు సాగే పాటగా దీన్ని చిత్రీకరించారు.

విజయం విజయం ఘన విజయం అంటూ సాగే ఈ పాటను సుప్రసిద్ధ గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యం ఆలపించగా మోహన భోగరాజు స్వరం కలిపారు. కళ్యాణి మాలిక్ మెలోడీ చాలా కూల్ గా ఉండగా వర్మ సినిమాల్లో పాటలకు భిన్నంగా ఇది వినబుద్ది అయ్యేలా కంపోజ్ చేశారు. వీడియో సాంగ్ మధ్యలో లక్ష్మి పార్వతిని ఉద్దేశించి ఎన్టీఆర్ నిన్ను అందరు ఎన్నెన్ని మాటలు అన్నారు ఈ విజయం వాళ్లకు చెంపపెట్టు కావాలి అని చెప్పి సినిమా ఉద్దేశాన్ని మరోసారి ఇందులో కూడా చూపించారు.

మధ్యలో కొన్ని షాట్స్ లో హరికృష్ణ చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర కుటుంబసభ్యుల పాత్రలను పోలిన యాక్టర్స్ ని చూపించారు. చరిత్రను బట్టి ఈ పాట తర్వాతే వెన్నుపోటు ఎపిసోడ్ మొదలవుతుంది. బాబు క్యారెక్టర్ తో ఆ మాట అనిపించడం మరోసారి ఇందులో రిపీట్ చేసారు. వర్మతో పాటు అగస్త్య మంజు జంట దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో మొత్తానికి వర్మ గత కొన్నేళ్లలో ఇవ్వలేని డీసెంట్ ఆడియోగా పేరు తెచ్చుకోవడం విశేషం.
Please Read Disclaimer